తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నందు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల కొరకు ఉచిత ఆన్లైన్ కోర్సు శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయటానికి tsbcstudycircle.cgg.gov.in నందు దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్ వివరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 24 నుండి 31వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు రూ. 2 లక్షలు మించకూడదు. మరిన్ని వివరాలకు 040-24071178, 6302427521 నెంబర్లకు ఆఫీస్ పనివేళలలో ఫోన్‌కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.