తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంత్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సహాధ్యక్షులుగా వేణుమాధవ్ రెడ్డి, హరికిషన్, కోశాధికారిగా అంజన్‌రావు, అదనపు కార్యదర్శులుగా అరవింద రెడ్డి, రమేశ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా శశిధరాచారి, చీటి విజయ్, పూర్ణచంద్ర రెడ్డి, యాదగిరి, శ్రీరాం, పద్మావతి, రేవతి, అనితా గ్రేస్, కార్యదర్శులుగా హన్మాండ్లు, వినయ్, సిరిమల్ల శ్రీనివాస్, యూనూస్, నవీన్ చంద్ర, పద్మజ, అరుణా గణేశ్, మైత్రీప్రియ, షబ్నా, ప్రశాంతి, మాన్వి జగన్, వెంకట్ ఆదిత్య, కార్యవర్గ సభ్యులుగా బాలకృష్ణ, ప్రమోద్, ప్రణతి, నాగార్జున, పవన్, అజ్మీరా శ్రీదాను నియమించినట్లు వారు తెలిపారు. త్వరలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ల సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలను నివేదిస్తామని వెల్లడించారు.
