మొక్క నాటడమూ మానవ సేవే: వనజీవి రామయ్య

మొక్క నాటడం కూడా మానవ సేవే అని పద్మశ్రీ అవా ర్డు గ్రహీత వనజీవి రామయ్య  పేర్కొన్నారు. మొక్కలు నాటితే అవి పెరిగి మానవాళికి ఆక్సిజన్‌ను ఇస్తాయని, అలా నాటడం కూడా మా ధవ సేవ చేయడంతో సమానమని అన్నారు. గ్రీన్‌ భద్రాద్రి ఆధ్వర్యం లో శ్రీ అభయాంజనేయస్వామి పార్కులో ఆదివారం జరిగిన మొక్క లు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్క నాటారు. గ్రీన్‌ భ ద్రాద్రి గౌరవ అధ్యక్షుడు శంకర్‌రావు, అధ్యక్షుడు యోగి సూర్యనారాయణ, దేశప్ప, భూపతిరావు, కంభంపాటి సురేశ్‌, కృష్ణార్జునరావు, ఉ మాశంకర్‌ నాయుడు, సంపత్‌, తిరుమలరావు, నాగరాజు పాల్గొన్నారు.