ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరింత కాలం ప్రజా సేవ చేయాలని వీరిద్దరూ ట్వీట్ చేశారు.
మీ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని మీ మద్దతుదారులకు పిలుపునివ్వండి అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.