సంగారెడ్డి జిల్లాలో విషాదం.. విషాహారం తిని ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. అదే ఆహారం తిన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బాధితులిద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఐదుగురు కుటుంబ సభ్యులు జొన్నరొట్టెలు తిన్నారు. ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే కుటుంబానికి చెందిన మహిళ 15 రోజుల కిందట మృతి చెందింది. చనిపోయిన మహిళ వినియోగించి పిండిని వినియోగించి కుటుంబ సభ్యులు రొట్టెలు చేసుకొని తిన్నారు. అయితే జొన్నపిండిలో విష పదార్థం కలిసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.