భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ సోమవారం దేశంలో ఉన్నచిరుతపులలకు సంబంధించిన లెక్కలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 60 శాతం పెరిగింది. ఇప్పుడు దేశంలో 12,852 చిరుతపులులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని పై ప్రధాన మంత్రి మోడీ స్పందించారు. ట్విట్టర్ ద్వారా పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి అభినందనలు తెలిపారు.
