తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. అవధులు లేని సంతోషాన్ని ప్రశాంతతను ఈ క్రిస్మస్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, త్యాగం సోదరభావం జీసస్ జీవితానికి ప్రతీకలని గుర్తుచేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు.