
రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల సద్వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.