న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి లేదు : సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ

నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా ఊరేగింపులు, ర్యాలీలు చేయవద్దని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి సబ్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని కేంద్రాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపతే చర్యలు తప్పవన్నారు. కరోనా సెంకడ్‌ వేవ్‌ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించి కరోనా కట్టడిలో భాగంగా తమ ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.