ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 472 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81, 948 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,71,588 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,256 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,104 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,740 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,17,64,418 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.