నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు

నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నూతన ఒరవడితో మరింత అభివృద్ధి చెందాలన్నారు. అంతేగాక ప్రజలకు, ప్రభుత్వానికి మరింత దగ్గర కావాలని ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు త్వరగా చేరే విధంగా ఈ వెబ్ సైట్ పనిచేయాలని, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం అందరి మీద ఉన్నందున అందరికి మరింత చేరువ అవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ వెబ్ సైట్ లో ప్రత్యేకంగా ఎవరూ చేయని విధంగా పర్యావరణానికి ప్రత్యేక స్థానం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరికి సమాజిక స్పృహా అవసరం అన్నారు.