ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్‌ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్‌ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.