పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంచికల్‌దిన్నె గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. ప్రకృతి వనం చాలా అందంగా ఉన్నదని, అదే విధంగా అన్ని గ్రామాల్లో సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అరిబండి సురేశ్‌, శ్రీరామ్మూర్తి, నారాయణ, జగతయ్య, రాజేశ్‌, చంద్రయ్య, నాగయ్య, పాలకవీడు మండల నాయకులు దర్గారావు, వెంకటరెడ్డి, అంజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.