మొక్క‌లు నాటిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్‌రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స్వంత గ్రామం గురుకుంటాలో ఎంపీ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ తనకు శుభాకాంక్ష‌లు తెలిపి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగ‌స్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో విస్తరింపజేయ‌నున్న‌ట్లు తెలిపారు.