మహబూబాబాద్ జిల్లా మానుకోట మార్కెట్‌ చైర్మన్‌గా ఉమాపిచ్చిరెడ్డి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌గా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డిని నియమించారు. డోర్నకల్‌ నియోజకవర్గ రాజకీయాల్లో రెడ్యానాయక్‌ అనుచరుడిగా కీలక పాత్ర పోషిస్తున్న పిచ్చిరెడ్డి సేవలను గుర్తించి రిజర్వేషన్‌లో భాగంగా ఆయన సతీమణి ఉమాకు మానుకోట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా నియమించారు. ఈదుల పూసపల్లి గ్రామానికి చెందిన మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అనుచరులుగా పేరు పొందిన సుధగాని మురళికి వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. తమ నియామకాలకు తొడ్పడిన డోర్నకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మార్కెట్‌ కమిటీ సభ్యులుగా సపావత్‌ హు స్సేన్‌, దేవి శ్యామల, సామినేని సతీశ్‌, జీ ఉపేందర్‌రెడ్డి, నలమాస శ్రీనివాస్‌, ఎల్‌ సీతారాం, యాద దామోదర్‌, బ్రిజ్‌ గోపాల్‌గిల్డాలు నియామకమయ్యారు.