సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌గా ఓవీ రమేశ్‌బాబు బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌గా ఓవీ రమేశ్‌బాబు శనివారం  ప్రాజెక్టు కార్యాలయంలో బాధ్యతలు  ఆదిలాబాద్‌ జిల్లా పెన్‌గంగ ప్రాజెక్టు ఎస్‌సీగా పనిచేసిన ఆయన  ఇక్కడికి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, మధ్యతరహా, భారీ నీటిపారుదల శాఖల్లో ఎలాంటి సమస్యలున్నా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ, మూసీ, ఎన్నెస్పీతోపాటు మైనర్‌, మధ్యతరహా ప్రాజెక్టుల కింద  6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని చెప్పారు. మూడు విభాగాలను సమన్వయం చేసుకుంటూ  సమర్థవంతంగా నీటిని అందిస్తామన్నారు.  సీఈకి పలువురు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఈఈ భద్రునాయక్‌, డీఈలు రమేశ్‌, నవీకాంత్‌, బుచ్చిలింగం, స్వామి, ఏఈలు ఉదయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జానీమియా, పలువురు ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు.