ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌, కొణిజర్ల  పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణాల నుంచి తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో.. టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌, కొణిజర్ల ఎస్‌ఐ మొగిలి తమ సిబ్బందితో  దాడులు నిర్వహించారు.

కొణిజర్ల మండలం క్రాంతినగర్ సాగర్ కాల్వ సమీపంలో నిల్వ చేసి వాహనంలో తరలిస్తున్న సమయంలో వలపన్ని పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నరి ఎలాంటి పత్రాలు లేకుండా  తరలిస్తున్నట్లు గుర్తించి బానోత్ రమేష్ ,తేజవత్ శివలాల్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. రేషన్ బియ్యం తరలింపులో కీలకంగా వ్యవహరించిన మరో నాలుగురిపై చట్టపరమైన చర్యల నిమిత్తం కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.