ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్ధప్రసాదాలను సుబ్బారెడ్డి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఆలయాల్లోని విగ్రహాల ధ్వంసంపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది.
