మై హోమ్ ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట : నిజామాబాద్ ఎంపీ అరవింద్

మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన పాత మైనింగ్ లీజులు రద్దు అవుతాయే తప్ప… కొనసాగే ప్రసక్తే లేదన్నారు. మైనింగ్ భూములపై రాష్ట్రానికి కేంద్రం ఇదివరకే నోటీసులు పంపిన సమాధానం ఇవ్వకపోవడంపై మండిపడ్డారాయన. ప్రభుత్వ భూములను మై హోమ్ కి అప్పగించటం రాష్టాన్ని అమ్ముకుతినడంలో భాగమన్నారు. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ వాళ్ళకు కావాల్సిన వాళ్ళతో అభిప్రాయాలను తీసుకుంటూ రైతులను పక్కన పెట్టిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని… ఇదంతా నూటికి నూరు శాతం జైలుకు పోయే ప్రక్రియలో భాగమన్నారు అరవింద్.