జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మొక్కలు నాటారు. అనంతరం కేటీపీపీ సిద్దయ్య, డీఎస్పీ సంపత్ రావు, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పది కోట్ల మొక్కల్ని మన రాష్ట్రంలో నాటి హరిత తెలంగాణను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నాలుగు కోట్ల మొక్కలు నాటడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఛాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటి.. సింగరేణి నిరీక్షణ రాజు, కేటీపీపీ సిద్దయ్య, స్థానిక డీఎస్పి సంపత్ రావు కు ఈ ఛాలెంజ్ ను విసిరాము.
గత కొద్ది రోజులుగా భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జంతువులు, కోతులు జనసంచారం చేస్తున్నాయి. జంతువులు, పక్షులు అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంతోపాటు కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లి పోయేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. అందువల్ల మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి వంతుగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.