గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి.యాది రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి. యాదిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు. అనంతరం జేసీ మెదక్, జేసీ కరీంనగర్, డీఎస్పీ కామారెడ్డి గారలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి. యాదిరెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఒక మంచి గొప్ప కార్యక్రం అన్నారు. ఇందులో నేను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కలు నాటాలని కొరారు.