తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అందజేశారు. ప్రకాష్ జవదేకర్‌తో పాటు సహచర ఎంపీలు కుమార్ కేట్ కార్, డాక్టర్ అనిల్ జైన్, వినయ్ శాస్త్ర బుద్దెలకు ఎంపీ సంతోష్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఈ పుస్తకాన్ని అందజేశారు. అడవులు, వృక్షాలకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను జోడించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వృక్షవేదం పుస్తకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. వృక్షవేదం పుస్తకం చాలా అద్భుతంగా ఉందన్నారు. అడవులు, ప్రకృతి అందాలను ఎంతో అద్భుతంగా చూపించారని తెలిపారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకువస్తుందన్నారు. వృక్ష వేదం పుస్తకాన్ని అద్భుతంగా రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.