తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు భోగి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.