జనగాం సంఘటనపై డీసీపీతో విచారణ

నిన్న జనగాం పట్టణంలో బీజేపీ నాయకులపై లాఠీఛార్జ్‌కు దారితీసిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీతో విచారణ చేపట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్‌ బుధవారం ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఘటన జరిగిన తీరు తెన్నులపై విచారణ నిర్వహించాల్సిందిగా పోలీస్ కమిషనర్ డీసీపీని అదేశించారు. అదే విధంగా ఈ సంఘటనలో పోలీసులు బాధ్యులుగా తెలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.