తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు గవర్నర్‌. ప్రాచీన, అద్భుత సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెల్లివిరియాలని గవర్నర్‌ తమిళిసై చెప్పారు.