ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ పోలీస్‌ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.