ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

73 వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా భారత సైన్యానికి చెందిన పరాక్రమ పురుషులు, మహిళలకు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా దేశ సేవలో చేసిన త్యాగాలను, ధైర్య సాహసాలను గుర్తుంచుకుంటామన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది అని తెలిపారు.