మళ్లీ పెరిగిన పెట్రో‌, డీజిల్‌ ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95, డీజిల్‌ ధర రూ.75.13కు చేరాయి.    

గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్నాయి. దీంతో జైపూర్‌లో పెట్రోల్‌ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరాయి. జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43గా ఉండగా, డీజిల్‌ ధర రూ.84.46కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.88.37, డీజిల్‌ రూ.81.99గా ఉన్నది.