రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా యాంకర్, బిగ్‌బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి విసిరిన చాలెంజ్‌ను ప్రముఖ నటి మీనా స్వీకరించారు. చెన్నైలోని సైదాపేట్‌లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనందరం బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి కోరారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, కన్నడ హీరో సుదీప్, మళయాళ హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌లకు చాలెంజ్ విసిరారు. వారు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.