ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.
