ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు సుధాకర్‌రెడ్డి అధికారులకు వెల్లడించాడు. సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి ఇరువురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా నాంపల్లి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.