ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులాల్లోని పేదలు, నిరుద్యోగ యువత పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీల అభ్యున్నతికి, స్వయం ఉపాధి కోసం ఈ సంవత్సరం రూ.786 కోట్లు కేటాయించామని తెలిపారు.
