ఒక ప్లాంట్ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకైంది. దీంతో ఈ విషవాయువు ప్రభావం వల్ల ఏడుగురు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఫ్లాంట్ వద్ద పోలీసులను మోహరించారు.
