టీటీడీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి కోటి విరాళం ఇచ్చారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన.. రంగనాయకుల మండపంలో విరాళాన్ని డీడీ రూపంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. నాలుగురోజుల క్రితం ఎస్వీబీసీ ట్రస్టుకు కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన డీఆర్‌ఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో దినేశ్‌నాయక్ రూ.1,11,11,111 విరాళమిచ్చారు.
