
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి పండుగను చైన్నైలో జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య నాయుడు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి రైతులందరికీ శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలిపెట్టడం అని వెంకయ్య తెలిపారు. ప్రకృతితో కలిసి జీవించడం అందరూ తమ దిన చర్యల్లో భాగం చేసుకోవాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు.