ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ షాక్‌

ఏపీలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల సం ఘం షాక్‌ ఇచ్చింది. ఏపీలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొన్నారు. ఫలితంగా 3.61 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారన్నారు. సాంకేతిక, న్యాయచిక్కుల వల్ల 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించా రు. ఏపీ పంచాయతీ ఎన్నికల పరిశీల కుడిగా ఐజీ సంజయ్‌కుమార్‌ను ఎన్‌ఈసీ నియమించింది. కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలతో నిమ్మగడ్డ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఏపీ ఎన్జీవో సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.