రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ఆదిలాబాద్ రూరల్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. గతంలో చేసిన రోడ్డు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం కింద ఏఈ చంద్రశేఖర్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఏఈ చంద్రశేఖర్ గుత్తేదారు వద్ద నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
