ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబసభ్యులు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారు ముందుగా అస్సీఘాట్‌కు చేరుకొని, అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. అక్కడ గంగానదికి హారతి ఇచ్చారు. స్థానిక ప్రజలతో ముచ్చటించారు. గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉన్నదని కవిత పేర్కొన్నారు. సాయంత్రం ప్రాచీన సంకటమోచన్ మందిరాన్ని దర్శించుకొని స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారి మహంత్ విశ్వంభరనాథ్ మిశ్రా ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్టు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
