జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్కింపు దాదాపు పూర్తయ్యింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్ అఫీషియోలుగా, 149 మంది కార్పొరేటర్లుగా తేల్చారు. 45 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులలో 33 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారుకాగా, మిగిలిన వారిలో ఒకటి బీజేపీ, పది మంది మజ్లిస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 11న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలంటూ త్వరలో వీరికి లేఖలు రాయనున్నట్లు సమాచారం.
