కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఎమ్మెల్సీ దంపతులను పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
