ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి 35 వేలకి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.కాగా రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు.
ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకూ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.