ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపునకు రూ.786 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. సబ్సిడీల కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ భూముల అభివృద్ధి, చిన్ననీటి పారుదల, విద్యుత్‌ కనెక్షన్లకు నేరుగా రుణాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు. ట్రాక్టర్లు, సరుకు రవాణాకోసం ఫోర్‌వీలర్స్‌‌, క్యాబ్‌లు, ఆటోలు, మినీ డెయిరీ కింద బర్రెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయనున్నామని తెలిపారు. ఇప్పటివరకు లక్షా 30వేల 104 దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 94 వేల 769 హార్టికల్చర్, వ్యవసాయ రంగం, 35 వేల 335 రవాణా రంగానికి చెందినవని వెల్లడించారు.