ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొన్ని నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తారు. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మీద రూపాయి ఏడు పైసలు బలపడి రూ.72.89వద్ద కొనసాగుతున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన 10.15 గంటలకు క్యాబినెట్ సమావేశం మొదలైంది.
అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలుసుకుననారు. బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి ముందు విత్తమంత్రి, రాష్ట్రపతిని కలువడం సంప్రదాయంగా వస్తున్నది. బడ్జెట్ నేపథ్యంలో బీఎస్ఈలో సెన్సెక్స్ 598 పాయింట్లు లాభపడింది.