కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రవాణాశాఖ అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో గతేడాది మార్చి 31 నాటికి అన్ని రకాల వాహనాలు మొత్తం 12,09,26,216 ఉన్నాయి. వీటిలో జీవితకాలం దాటిన రవాణా వాహనాలు 1,31,083 ఉండగా.. వ్యక్తిగతమైనవి మరో 8,02,202 ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన నిబంధనలు అమల్లోకి వస్తే 9,33,285 వాహనాలు తుక్కు కింద మారనున్నాయి. కేవలం హైదరాబాద్ పరిధిలోనే నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు 6,03,535, ట్రాన్స్‌పోర్టు వాహనాలు 78,373 ఉన్నట్టు సమాచారం. అంటే కేవలం హైదరాబాద్‌లోనే 6,81,908 వాహనాలు తుక్కు కిందకు మారనున్నాయి.
