హైద‌రాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ త‌ర‌లింపు

‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను మెట్రో రైలు అధికారుల స‌హకారంతో అపోలో ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా త‌ర‌లించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో అతని గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను త‌ర‌లించారు. ఉప్ప‌ల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారుల‌కు ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారం ఇవ్వ‌డంతో ఈ ఏర్పాట్లు చేశారు.