భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కేకే

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఝా నియమించారు. ఈ విషయాన్ని ఆయన లేఖ ద్వారా కేకేకు తెలియజేశారు. ఎఫ్‌సీఐ తెలంగాణ రాష్ట్ర విభాగానికి కేకే చైర్మన్‌ హోదాలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు జారీచేస్తారు.