సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను విధించినట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు మంగళవారం పీసీబీ నివేదించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సిరామిల్ ఎంటర్ ప్రైజెస్ రూ.8.32 కోట్లు, జహీరాబాద్ లోని ప్రీగెరియా కర్జర్వా అల్లనా ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.1.75 కోట్లు, సిద్ధివినాయక అయిల్ మిల్ కు రూ.14.20 లక్షల జరిమాన విధించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మూడు పరిశ్రమల వల్ల జహీరాబాద్ పరిసర ప్రాంతాల నీరు కలుషితమవుతోందని, భూగర్భ జలాలతో పాటు తాగునీటి నాణ్యత పూర్తిగా
దెబ్బతింటోందంటూ డేళ్ల క్రితం లక్ష్మారెడ్డి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించి ఎన్జీటీ కేసు నమోదు చేసింది. పర్యావరణ నిబంధనలను మూడు పరిశ్రమలు ఉల్లంఘిస్తున్నాయని పరిశీలనలో తేలడంతో జరిమాన విధించినట్లు ఎన్జీటీకి పీసీబీ నివేదించింది.
