సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సిన్హా నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ నియమితులయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ప్రవీణ్‌సిన్హా సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గత రెండేండ్లుగా సీబీఐ డైరెక్టర్‌గా వ్యవహరించిన రిషీకుమార్ శుక్లా పదవీకాలం బుధవారంతో ముగిసింది. ప్రధాని, విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సీబీఐ డైరెక్టర్‌ను నియమిస్తుంది.
