తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఈడీ శంకర్‌రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని గురువారం మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను శంకర్‌రెడ్డి స్వీకరించారు. తారామతి బారామతి హోటల్ నందు మొక్కలు నాటారు.
