
కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్ కె కన్వెన్షన్‌లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించారు. ఎడ్ల పందాలను ప్రారంభించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులు నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరితో కలిసి ఎడ్ల పోటీలను తిలకించారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.